
ఎరలతో చీడపీడలకు చెక్
గుర్రంపోడు: పంట దిగుబడి తగ్గడానికి తెగుళ్లతో పాటు పురుగులు ప్రధాన కారణం. చీడపీడల నివారణకు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాకుండా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పురుగు మందులు విచ్చలవిడిగా వా డటం వల్ల మిత్ర పురుగులు నశిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు ఖర్చులు తగ్గించుకుని, మిత్ర పురుగులు కాపాడుకోవడానికి లింగాకర్షణ బుట్టలు, స్టిక్ ఏ ఫ్లయ్, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి సూచిస్తున్నారు.
లింగాకర్షణ బుట్టలు
పంటలను ఆశించే పురుగులు ఒక పురుగు నుంచి మరో పురుగుకు వచ్చే కొన్ని రకాల వాసనల వల్ల ఆకర్షించబడతాయి. తద్వారా పురుగుల ఉధృతి పెరుగుతుంది. వీటి నివారణకు లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి. వీటిలో కొన్ని రకాల వాసనల వల్ల ఆడ పురుగు, మగ పురుగును ఆకర్షించే వీలు కలుగుతుంది. ఈ బుట్టలను నెలకు ఒకటి చొప్పున మార్చాలి. పురుగుల ఉధృతిని గుర్తించేందుకు ఎకరాకు 4 బుట్టలు, వీటి నివారణకు తర్వాత ఎకరాకు 10 బుట్టలు అమర్చాలి. లింగాకర్షణ బుట్టలు అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు. వరి, మొక్కజొన్న, పత్తి, అన్ని రకాల కూరగాయలకు లింగాకర్షణ బుట్టలు వాడవచ్చు. ఒక్కో పురుగును ఆకర్షించడానికి ఒక్కో రకమైన బుట్టలు ఆయా పంటలను ఆశించే పురుగులను బట్టి బుట్టలు అమర్చాలి. 25 నుంచి 30 రోజులకు బుట్టలను మార్చాలి. ముఖ్యంగా పురుగు మందులు వాడేటప్పుడు
ఎల్లో స్టిక్కీ ట్రాప్
దీనిని స్టిక్ ఏ ఫ్లయ్ అంటారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఇవి ఉపయోగపడతాయి. ఎల్లో స్టిక్కీ ట్రాప్ ఉపయోగించి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుముడత పురుగు, పచ్చదీపపు పురుగును అరికట్టవచ్చు. ఇవి పసుపు రంగుకు ఆకర్షితమై ట్రాప్ ఉన్న జిగురుకు అంటుకుపోతాయి.
తొలిదశ నుంచే ఎరలు వాడాలి
పంట తొలిదశ నుంచి పురుగు ఉనికి కనబడక ముందు నుంచే వాడి, పురుగు ఉనికి గుర్తిస్తే మొక్కలను కదల్చడం ద్వారా ప్రత్యేకించి తెల్లదోమ పురుగులు ఎక్కువగా అంటుకుంటాయి. 50శాతం కన్నా ఎక్కువ పురుగులతో నిండే వరకు ఎన్ని నెలలైనా ఇవి పనిచేస్తుంటాయి. 50శాతం కన్నా ఎక్కువ పురుగులు నిండగానే ఇవి మార్చుకోవాలి. ఎరను తూర్పు, పడమర దిశల్లో ఎకరానికి 10 లింగాకర్షణ బుట్టలు అమర్‌చిౖ పెన ఉన్న పేపరు తొలగించాలి. పురుగు ఉదతిని గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా కూరగాయలు, పండ్లతోటల్లో కాయతొలుచు పురుగు లాంటి నివారణకు ఎరల ద్వారా నివారించవచ్చు.

ఎరలతో చీడపీడలకు చెక్