
కరాటేలో వరల్డ్ రికార్డు సాధించిన రామకృష్ణానాయక్
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని సుమన్ షాటోఖాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్ బాండావత్ రామకృష్ణానాయక్ ఉమ్మడి జిల్లాలో 67,776 మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు సాధించారు. ఈ నెల 5న చైన్నైలోని ఎస్‌ఐవీఈటీ కళాశాలలో వరల్డ్ కరాటే మాస్టర్ బాలమురుగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో రామకృష్ణానాయక్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్నారు. రామకృష్ణనాయక్‌ను ప్రముఖ సినీ నటుడు, సుమన్ షాటోఖాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు సుమన్, అకాడమీ కరాటే మాస్టర్ బుడిద సైదులు అభినందించారు.
జాతీయ రహదారిపై
కారు దగ్ధం
చౌటుప్పల్ రూరల్: ౖహెదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి ఓ కారు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఎ. సంతోష్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఎస్‌బీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 7గంటలకు అతడు గచ్చిబౌలి నుంచి విశాఖపట్నంకు కారులో బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ దాటుతుండగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కారులో నుంచి పొగ వస్తుండటం గమనించి మోహర్‌నగర్ వెళ్లే రోడ్డు సమీపంలో కారు ఆపాడు. ఈ క్రమంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కారులో ఒక్కరే ఉండడం అతడికి ఎలాంటి గాయాలు కాలేదు.

కరాటేలో వరల్డ్ రికార్డు సాధించిన రామకృష్ణానాయక్