
మెనూ తప్పనిసరిగా పాటించాలి
బొమ్మలరామారం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మంగళవారం బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో గల జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మిడ్ డే మీల్స్ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ రాజాత్రివిక్రమ్, మండల వైద్యాధికారి సుమలత, ఆయుష్ డాక్టర్ క్రాంతి కుమార్, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉపేంద్ర తదితరులు ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు