పాఠశాలల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల తనిఖీ

Oct 8 2025 6:03 AM | Updated on Oct 8 2025 6:03 AM

పాఠశా

పాఠశాలల తనిఖీ

రాజాపేట : మండలంలోని బసంతపురం, నెమిల గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను, విద్యార్థుల నోట్‌బుక్స్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభా పాఠవాలు పరిశీలించారు. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

క్షేత్రపాలకుడికి

నాగవల్లి దళార్చన

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు పాలతో అభిషేకించి, నాగవల్లి దళార్చన జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగించారు.

మాతా శిశు సంరక్షణ అత్యంత కీలకం

రామన్నపేట: మాతా, శిశు సంరక్షణ వైద్య ఆరోగ్యశాఖకు అత్యంత కీలకమైన అంశమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. మంగళవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించాలన్నారు. బీపీ, షుగర్‌ పేషెంట్లను రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేసి మందులు ఇవ్వాలని సూచించారు. వైద్య ఉద్యోగులు విధి నిర్వహణను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. సమావేశంలో వైద్యులు సుమన్‌ కళ్యాణ్‌, అశ్వినికుమార్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

అధ్యాపకులకు శిక్షణ

నల్లగొండ టూటౌన్‌ : ప్రతివిద్యార్థి సబ్జెక్టులో మెరుగైన అభ్యసనాన్ని, సాంకేతికంగా మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని ఎంజీయూ గణితశాస్త్ర విభాగం అధ్యాపకురాలు హైమావతి వివరించారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ అధ్యాపకులకు అవుట్‌ కం బేస్డ్‌ ఎడ్యుకేషన్‌పై శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రోగ్రాం, కోర్స్‌ లక్ష్యాల ఆధారంగా మూల్యాంకన విధానాన్ని అధ్యాపకులకు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అలువల రవి, మిర్యాల రమేష్‌, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల తనిఖీ1
1/2

పాఠశాలల తనిఖీ

పాఠశాలల తనిఖీ2
2/2

పాఠశాలల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement