
బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కుట్ర
ఫ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
కొత్త నర్సింహ స్వామి
భువనగిరి : బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న 42శాతం రిజర్వేషన్లను అడ్డుకునేందుకు రెడ్డి సంఘం నాయకులు కుట్ర చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహ స్వామి అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సాబన్‌కార్ వెంకటేశం, ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు పేరపు రాములు, వలిగొండ మండల అధ్యక్షుడు నాయిని యాదగిరి, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ నర్సింహ చారి, ఉపేంద్రచారి, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు.