
ఎన్నికల్లో పొరపాట్లకు తావుండరాదు
తుర్కపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం ప్రిసైడింగ్ ఆఫీసర్ల(పీఓ) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి వారికి ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమావళి తదితర అంశాలపై వివరించారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని, అన్ని విషయాలపై అవగాహన ఉన్నప్పుడే సక్రమంగా పోలింగ్ నిర్వహించగలరని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా పీఓలే బాధ్యత వహించాలని ఉంటుందని, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జానయ్య, ఎంపీడీఓ లెంకల గీతారెడ్డి, తహసీల్దార్, దేశ్యానాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు