
నార్మూల్ ధరకే ఒప్పందం
ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ డెయిరీతో యాదగిరి దేవస్థానం అధికారులు ఒప్పందం కుదుర్చుకొని గత నెల 23వ తేదీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 142 క్యాన్ల నెయ్యి తీసుకున్నారు. అంతే కాకుండా శ్రీస్వామి వారి ఆలయంలో దీపానికి సైతం విజయ డెయిరీకి సంబంధించిన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తుంది. మదర్ డెయిరీ ధర ప్రకారమే విజయ డెయిరీ నుంచి సైతం నెయ్యిని అందజేసేందుకు అగ్రిమెంట్ కుదిరింది. మదర్ డెయిరీ కిలో నెయ్యి రూ.580, జీఎస్టీతో కలిపి రూ.609కి అందజేసింది. అదే రేటును జీఎస్టీతో కలుపుకొని విజయ డెయిరీ చెల్లిస్తుంది.