
వాడపల్లి వద్ద ఆర్డీఆర్ అస్థికలు నిమజ్జనం
మిర్యాలగూడ: అనారోగ్యంతో మృతిచెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్) అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. కాగా.. దామోదర్‌రెడ్డి అస్థికలను ఆదివారం ఆయన కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు దామరచర్ల మండలం వాడపల్లిలోని కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్‌రెడ్డి సోదరులు గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, భాస్కర్, జెన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి, చకిల రాజేశ్వర్‌రావు, కోతి గోపాల్‌రెడ్డి, అంజద్‌అలీ, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.