
ఉత్తమ ఫలితాలకు ‘దీపిక’
మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన పార్ట్–2 పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. గణితం, ఫిజిక్స్, బయోసైన్స్, సాంఘిక శాస్త్రం పుస్తకాలు రాగా వీటిని భువనగిరిలోని పాత గ్రంథాలయంలో భద్రపరిచారు. జిల్లాలో 715 ప్రభుత్వ స్కూళ్లు, 38,582 మంది విద్యార్థులు ఉన్నారు. 97,980 పుస్తకాలకు గాను 77,450 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 20,530 పుస్తకాలు త్వరలో రానున్నాయి. దసరా సెలవుల పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పార్ట్–1కు సిలబస్ చివరి దశకు చేరిందన్నారు.
భువనగిరి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. దసరా తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు పాఠ్యాంశాల్లో ఉత్తమ మార్కులు సాధించేలా వారిని తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంబంధిత నిపుణులతో తయారు రూపొందించిన అభ్యాస దీపికలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఒత్తిడి లేకుండా రాయడంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనకు ఉపకరించేలా రాష్ట్ర విద్యా పరిఽశోధన అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విషయ నిపుణులతో తయారు చేయించారు. వీటిని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ముద్రించారు. ప్రతి విద్యార్థికి గణితం, సాంఘిక, జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి నాలుగు దీపికలను అందజేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 4,521 మంది ఉండగా.. 23,101 అభ్యాస దీపికలు జిల్లాకు చేరాయి. ఇంకా 1,010 రావాల్సి ఉంది.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
గత విద్యా సంవత్సరం జిల్లా రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. ఈఏడాది మొదటి స్థానంపై విద్యాశాఖ దృష్టి నిలిపింది. రాష్ట్ర విద్యాశాఖ లాంగ్వేజ్ మినహా ఇతర అభ్యాస దీపికలను అందజే యగా.. జిల్లా విద్యాశాఖ దాతల సహకారంతో నిపుణులతో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల అభ్యాస దీపికలు తయారు చేయించి ఇవ్వనుంది.
ఫ టెన్త్ విద్యార్థుల కోసం నిపుణులతో ప్రత్యేకంగా పుస్తకాల రూపకల్పన
ఫ జిల్లాకు చేరిన అభ్యాస దీపికలు
ఫ దసరా తరువాత పంపిణీ
పాఠశాలలు 715
టెన్త్ విద్యార్థులు 4,521
వచ్చిన అభ్యాసన దీపికలు 23,101
రావాల్సినవి 1,010