
ఊరంతా తొమ్మిది రోజులు నిష్టతో..
మాడుగులపల్లి: మాడ్గులపల్లి మండలం అభంగాపురం గ్రామస్తులు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో నిష్టగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా గ్రామస్తులందరూ కలిసి కులమతాలకతీతంగా గ్రామంలో ఒకే అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో తొమ్మిది రోజులు గ్రామంలోని ఏ ఇంట్లో కూడా మద్యం, మాంసం ముట్టరు. ఈ ఆచారం గత నాలుగేళ్లుగా పాటిస్తున్నారు. చివరి రోజు భక్తులందరూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. ఇంత నిష్టగా పూజలు చేయడం వల్లనే అమ్మవారి కృపతో తాము ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటామని గ్రామస్తులు నమ్ముతున్నారు. దసరా రోజు కూడా గ్రామస్తులు మద్యం, మాంసం ముట్టకపోవడం విశేషం.
ఫ మద్యం, మాంసం ముట్టకుండా నవరాత్రులు జరుపుకుంటున్న
అభంగాపురం గ్రామస్తులు