
బుద్ధవనంలో బతుకమ్మ సంబరాలు
నాగార్జునసాగర్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్‌కాలనీ, హిల్‌కాలనీల నుంచి మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో బుద్ధవనం తరలివచ్చారు. బుద్ధవనం, విజయవిహార్, మున్సిపల్ సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. అనంతరం లోటస్‌పాండ్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శాంతిలాల్, మున్సిపల్ కమిషనర్ చింతా వేణు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.