
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
హుజూర్‌నగర్: పాలకవీడు మండల పరిధిలోని దక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద సోమవారం వలస కార్మికులు పోలీసులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన వారి కోసం మంగళవారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిశ్రమ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. పోలీసులు, ప్రత్యేక బలగాలతో పరిశ్రమ కాలనీల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం చుట్టుపక్కల గ్రామాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామన్నారు.