
బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై..
ఇబ్రహీంపట్నం రూరల్: బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైన మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిఽధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి(66) రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టీసీఎస్ ఎదుట ఉన్న వెంకటేశ్వర హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తుంది. ఈ నెల 21న హాస్టల్‌లో ఉండే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడింది. ఈ క్రమంలో అలసటగా ఉందంటూ గదిలోకి వెళ్లింది. ఎడమ చేయి లాగుతోందని చెప్పడంతో జండూబామ్ రాసి పడుకోబెట్టారు. ఛాతిలో కూడా నొప్పి వస్తోందని చెప్పడంతో ఆర్‌ఎంపీని పిలిపించారు. పల్స్ బాగా పడిపోవడంతో రాత్రి 12:30 గంటలకు అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మి గతంలో సీపీఐ(ఎంఎల్) పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా, ప్రగతిశీల మహిళా సమాఖ్య(పీఓడబ్ల్యూ) సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. లక్ష్మికి భర్త నాగయ్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఫ గుండెపోటుతో మహిళ దుర్మరణం
ఫ మృతురాలి స్వస్థలం గరిడేపల్లి
మండలం రంగాపురం