
ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగుల పెన్‌డౌన్
భువనగిరిటౌన్ : ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ శ్యాంసుందర్ వ్యవహారశైలికి నిరసనగా ఆ శాఖ ఉద్యోగులు మంగళవారం పెన్‌డౌన్ చేశారు. అంతా బయటకు వచ్చి నిరసన తెలిపారు. శ్యాంసుందర్ తమ శాఖ అదనపు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారని, మహిళా ఉద్యోగుల విషయంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము చేసే ప్రతి పనిలో ఉద్దేశపూర్వకంగా తప్పులు వెతికి వేధిస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. పని వేళలు ముగిసినా ఎక్కువ సమయం కార్యాలయంలో ఉండేలా ఇబ్బంది పెడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు భగత్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీకాంత్, విష్ణువర్ధన్, జగదీశ్, జ్యోతిర్మయి, ఎండీ జహంగీర్, అఫాన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఈడీ శ్యాంసుందర్ ధోరణిపై నిరసన