
పరిహారం పెంచకపోతే భూములివ్వం
గౌరెల్లి–కొత్తగూడెం జాతీయ రహదారిలో పోతున్న భూములకు తక్కువ పరిహా రం ఇస్తున్నారు. వలి గొండ మండలం మీదుగా వెళ్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు ఇచ్చిన పరిహారం కంటే తక్కువ నిర్ణయించారు. రోడ్డు కోసం తమకు జీవనాధారమైన భూములు ఇవ్వడానికి అంగీకరిస్తే తక్కువ రేటు నిర్ణయించడం సరికాదు. రీజినల్ రోడ్డులో పోతున్న భూములకు ఇచ్చిన విధంగానే మా భూములకు కూడా పరిహారం చెల్లించాలి. పరి హారం పెంచకపోతే భూములను ఇవ్వబోము.
– కొలను వెంకట్‌రెడ్డి, భూ నిర్వాసితుడు,
వలిగొండ మండలం