
మహిళల స్వేచ్ఛా సమానత్వం కోసం ఉద్యమించాలి
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం (ఐద్వా) అఖిలభారత ప్రజాతంత్ర మహిళా మూడవ మహాసభను జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం ఉద్యమించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు మాయరాని, ఐద్వా నాయకురాలు దాసరి మంజుల, మాటూరి కవిత, గద్దె లత, గంధమల్ల బాలమణి, సింగనబోయిన లావణ్య, వల్దాసు జంగమ్మ, బందేల అనసూయ, తాడూరి కలమ్మ, దండులత, సునీత, మంగ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి
బట్టుపల్లి అనురాధ