
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి,యాదాద్రి : అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుంటే వానాకాలం ధాన్యం దించుకోబోమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీర్మానించారు. గురువారం భువనగిరిలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మిల్లుల్లో ఖరీఫ్ ధాన్యం 4,40 లక్షల మెట్రిక్ టన్నులు, రబీ ధాన్యం 25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందన్నారు. ఎఫ్‌సీఐ సకాలంలో బియ్యం తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే నాగిరెడ్డిపల్లి గోదాములో 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉందన్నారు. 400 ఏసీకేల ఽబాయిల్డ్, రా రైస్ నిల్వ ఉందన్నారు. వ్యాగన్ వచ్చిన రోజు 90 ఏసీకేల ధాన్యం డెలివరీ అవుతుందని, దీంతో మిల్లులు నెలలో పది రోజులు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం 2009 నుంచి మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు చెల్లించాలన్నారు. 2014–15 నుంచి 2024–25 వరకు పెండింగ్‌లో ఉన్న డ్రైఏజ్ చార్జీలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములలో కిరాయిలు మాఫీ చేయాలన్నారు. 2024–25 లో బాయిల్డ్ రైస్ 41 శాతం ఇప్పించాలన్న ప్రధాన డిమాండ్‌లతో వినతి పత్రం అందజేశారు. రైస్ మిల్లర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మార్త వెంకటేషం, కోట మల్లారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసునూరి నాగభూషణం, కోశాధికారి గౌరిశెట్టి అశోక్, ప్రతినిధులు మిట్లపల్లి నగేష్, సోమనర్సయ్య, వెంకటేశం ఉన్నారు.
ఫ కలెక్టర్‌కు రైస్ మిల్లర్ల వినతి