ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు ఆర్ఆర్ పేట రోడ్డులో ఎస్ఆర్ షాపింగ్ మాల్‌ను బుధవారం పునఃప్రారంభించారు. ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, సినీ నటి రితికా నాయక్, బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ మాట్లాడుతూ ఇలాంటి షోరూమ్‌ల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నటి రితికా నాయక్ మాట్లాడుతూ కుటుంబంతో కలిసి షాపింగ్ చేయడానికి ఇక్కడ మంచి కలెక్షన్లు, పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సంస్థ ఎండీ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 21 ఏళ్ల అనుభవంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 షోరూమ్‌లు ఏర్పాటు చేశామని, త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రారంభిస్తామన్నారు. డైరెక్టర్లు ప్రసాద్‌రెడ్డి, కేశవరెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.


