భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు లోని ఏఎస్ రాజు రెసిడెన్సీ భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ బడేటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్షన్ ఆఫీసర్‌గా గూడూరి సాంబమూర్తి వ్యవహరించగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా వేమిరెడ్డి హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా ఏఎస్‌ఎన్ రాజు, ఇళ్ళ మధుసూదనరావు, కార్యదర్శిగా వానపల్లి రమేష్, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి, కోశాధికారిగా ఆర్.సూరిబాబు, కార్యవర్గ సభ్యులుగా పి.ధీరేశ్వరనాధ్, విక్రమరావు, టి.సుధా దేవి, వి.దేవి, కో–ఆప్షన్ సభ్యులుగా నందమూరి విష్ణుమూర్తి, పి.సత్యనారాయణ, గౌరవ చైర్మన్‌గా ఇళ్ల రాధాకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా పాపోలు ఏడుకొండలు, మిడతాని సురేష్ కుమార్‌లు నియమితులయ్యారు. నూతన కమిటీ నాలుగు సంవత్సరాల పాటు పదవీకాలంలో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి జి.పవన్ తదితరులు పాల్గొన్నారు.


