వైఎస్సార్‌ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

ఏలూరు టౌన్‌: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్‌, ఫ్లోరింగ్‌ మరమ్మతులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద వాటర్‌ ఫౌంటెయిన్‌ నిర్మిస్తామంటూ రైలింగ్‌, ఫ్లోరింగ్‌ తొలగించారనీ, కానీ నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తామే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఏలూరు నగరంలోనూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి చర్యలు చేపట్టాలని కోరినట్లు సమన్వయకర్త జయప్రకాష్‌ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, రాష్ట్ర మహిళ ప్రదాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల ఉన్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వికి

వైఎస్సార్‌ సీపీ నాయకుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement