సెప్సిస్‌ ప్రాణాంతకం.. | - | Sakshi
Sakshi News home page

సెప్సిస్‌ ప్రాణాంతకం..

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

నిర్ధారణ కచ్చితంగా జరగాలి వ్యాధి వ్యాప్తి ఇలా..

వ్యాధి నిర్ధారణ

తీవ్ర అనారోగ్యానికి గురువుతున్న బాధితులు

జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

యలమంచిలి: ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. చాలారోగాలు ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంటాయి. సాధారణంగా నలతగా ఉందంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిందంటూ ఉంటా. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన తరువాత ఏ ఇన్‌ఫెక్షనో చెబుతారు. అయితే ఈ సమస్యపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకం అయినా చాలామంది కొంచెం నలతగా ఉంటే సొంత వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇన్‌ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను సెప్సిస్‌ అంటారు. శరీరంలో సోకే ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ అయినా అదుపు చేయకపోతే అది తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు (సెప్సిస్‌)కు దారి తీయవచ్చు.

తొలుత ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ కచ్చితంగా జరగాలి. అనంతరం నియంత్రణకు అవసరమైన చికిత్స చేయించాలి. మల్టిఫ్లెక్స్‌ పీసీఆర్‌ అనే అధునాతన వైద్య పరీక్ష ద్వారా త్వరితగతిన సెప్సిస్‌ను నిర్ధారించవచ్చు. బయోఫయర్‌ ద్వారా మూడు గంటల్లో నిర్ధారణ చేయవచ్చు. నిర్ధారణతోపాటు ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణకు కావాల్సిన మందులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు యాంటిబయాటిక్స్‌ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి.

– డాక్టర్‌ ఆర్‌ శ్రీ సాహిత్య ఎమర్జెన్సీ,ఐసీయూ, అత్యవసర చికిత్స వైద్య నిపుణురాలు, పాలకొల్లు

ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, చిన్న పిల్లలకు, ఊపిరితిత్తులు, గుండె, లివర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, హెచ్‌ఐవీ బాధితులకు, సుగర్‌ వ్యాధి బాధితులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే అవ కాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది సెప్పిస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో కోటిమంది ప్రాణాలు ప్రమాదస్థితికి చేరుకుంటున్నా యి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం మంది సెప్సిస్‌వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

లక్షణాలు

ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి.

వ్యాధి సోకే భాగాలు

నూటికి 50 శాతం ఊపిరితిత్తులు. కిడ్నీలు, బ్రెయిన్‌, యూరినరి ట్రాక్‌, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్‌ఫెక్షన్‌లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్నిసార్లు ఆపరేషన్ల ద్వారా ఆ గాయాలను తొలగించాల్సి వస్తుంది.

బ్లడ్‌ కల్చర్‌, కార్బాఆర్‌, బయోఫైయర్‌ (అన్ని రకాల సూక్ష్మ క్రిములకు) పరీక్షల ద్వారా సెప్సిస్‌ని నిర్ధారిస్తారు. అంటువ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్‌ఫెక్షన్ల వల్ల పనిచేయడం మానేస్తాయని వివరిస్తున్నారు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ (సెప్సిస్‌) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్‌ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement