లక్ష్మీపురంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీపురంలో చోరీ

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

లక్ష్మీపురంలో చోరీ ఇంద్రజాలికుడు బోస్‌కు ‘మార్నింగ్‌ స్టార్‌’ అవార్డు శ్రీవారి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు అంటూ హల్‌చల్‌ డ్వాక్రా అవినీతిపై నిగ్గు తేల్చాలి

దెందులూరు: పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్‌లో రైతు మన్నె సుబ్రహ్మణ్యం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి యజమానులు ఇంట్లో ఉండకపోవడంతో అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మంగళవారం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన తెలుసుకున్న పెదవేగి సీఐ సీహెచ్‌ రాజశేఖర్‌, పెదవేగి ఎస్సై హరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బాధితులను పరామర్శించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): శోభిత వర్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, మ్యాజిక్‌ స్టార్‌ డాక్టర్‌ బోస్‌ను ‘మార్నింగ్‌ స్టార్‌’ బిరుదుతో సత్కరించారు. మ్యాజిక్‌ రంగానికీ, రచనా రంగానికీ బోస్‌ చేస్తున్న విశిష్ట సేవలను ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస వర్మ కొనియాడారు. ఎస్వీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శనలు, ఏక పాత్రాభినయ పోటీలు, కవితా పఠనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు నూతన ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసినట్టు ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అందులో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి చైర్మన్‌గా ఎస్వీ సుధాకరరావుతో కలిపి 17 మంది సభ్యులతో ట్రస్టుబోర్డు ఏర్పాటు చేసినట్టు అందులో పేర్కొన్నారు. చైర్మన్‌ మినహా మిగిలిన 16 మందిలో 13 మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీకి చెందిన వారు ఉన్నట్టు లిస్ట్‌లో పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావు, ద్వారకాతిరుమలకు చెందిన కంపసాటి నాగసీత, నల్లజర్లకు చెందిన యలమాటి శ్రీనివాసరావు, ఆవపాడుకు చెందిన అచ్యుత సత్యనారాయణ, యర్నగూడేఇకి చెందిన పాలూరి వెంకట చరిత, దుద్దుకూరుకు చెందిన కడియం సత్యవతి, హుకుంపేటకు చెందిన హోట వీరభద్రరావు ఎంపికై నట్టు లిస్ట్‌లో ఉంది. అలాగే ఏలూరుకు చెందిన చలువాది శివకృష్ణ, అనపర్తికి చెందిన పల్లి శ్రీనివాసరెడ్డి, తణుకుకు చెందిన కాకి సురేష్‌ కుమార్‌, అల్లి సత్యనారాయణ, నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, గూడూరుకు చెందిన బత్తిన ప్రమీల, ప్రత్తిపాడుకు చెందిన చిరుగూరి సుశీల, తాడేపల్లిగూడేనికి చెందిన కాసిరెడ్డి మధులత, ఎమ్మిగనూరుకు చెందిన యుకే సుహాసిని ఎంపికై నట్టు ఉంది.

ఆకివీడు: డ్వాక్రా యానిమేటర్ల అవినీతిలో అధికారులు, బ్యాంకు అఽధికారుల భాగస్వామ్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి ఆరోపించారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం ఐద్వా సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకివీడులోని సంతపేట, సమతానగర్‌ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 2 కోట్ల మేర టోకరా వేసిన సంఘటనపై నేటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో దుర్వినియోగమైన సొమ్మును డ్వాక్రా సభ్యుల వద్ద నుంచి వసూలు చేసేందుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. గతంలో మేము తీసుకున్న సొమ్ము మాత్రమే తిరిగి చెల్లిస్తామని, అవినీతికి గురై బ్యాంక్‌లో డ్రా చేసిన సొమ్ముకు మాకు సంబంధంలేదని డ్వాక్రా సభ్యులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్‌ అధికారులు స్పందించకపోతే డ్వాక్రా సభ్యులతో జిల్లా అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఉదయకుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో డోకల లక్ష్మి, గేదల లావణ్య, ఎర్రా కృష్ణవేణి, బొక్కా కళ్యాణి, అర్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement