సంక్షేమం అమల్లో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు
నరసాపురం: ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో చంద్రబాబు సర్కారు పూ ర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అ న్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన నరసాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు చివరకు ఉద్యోగులు కూడా సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఎన్నికల్లో సూపర్‌సిక్స్ అంటూ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి నేతలు హామీలు అమలు చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపుతో వేల కోట్ల భారం మో పారన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గి పోయిందని, సంక్రాంతి పండగ రోజుల్లోనూ అప్పుల కోసం తిరుగుతున్నారన్నారు.
కోటి సంతకాలకు విశేష స్పందన : పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటిసంతకాల ప్రజా ఉద్యమానికి ప్రజల్లో విశేష స్పందన వచ్చిందని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నేతలకు సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, ఎంపీపీ మైలాబత్తుల సోనీ, జెడ్పీటీసీ బొక్కా రాధాకృష్ణ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, పెండ్ర వీరన్న, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, మాజీ జెడ్పీటీసీ చాగంటి సత్యనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ పాలా రాంబాబు, పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి, మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్, మొగల్తూరు మండల అధ్యక్షుడు రేవు నారాయణ రాజు, స్టేట్ అగ్నికుల క్షత్రియ విభాగం అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, నాయకులు దొంగ మురళీకృష్ణ, గొట్టుమక్కల సూర్యనారాయణరాజు, నల్లిమిల్లి జోసఫ్, తన్నేటి గిరి, ఇంజేటి జాన్ కెనడీ, వంగలపూడి జకరయ్య, కడలి రాంబాబు, చినిమిల్లి చందు తదితరులు పాల్గొన్నారు.


