చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
భీమవరం: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ప్రజ ల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీని మరింత పటిష్టం చేయాల్సిన అ వసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. శనివారం భీమవరంలో పార్టీ నియోజకవర్గ సమన్వకర్త చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయకమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ గ్రామ, వార్డు కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీలకు నియోజకవర్గం నుంచి ఎంపికచేసే నాయకుల జాబితాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట కార్యదర్శి పేరిచర్ల విజయ నర్సింహరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, భీమవరం పట్ట ణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్షులు గాదిరాజు రామరాజు, పార్టీ నాయకులు ఏఎస్ రాజు, కోడె యుగంధర్, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, నాయకులు ఇంటి సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్, మానుకొండ ప్రదీప్, యరకరాజు ఉమాశంకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


