సైడ్ లైట్స్
● సెయింట్‌గ్జేవియార్ పాఠశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వాహనాలు రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సెక్యూరిటీ విఫలమైనట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది.
● గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల పాదాల రక్షణ నిమిత్తం దారి పొడవునా పరచిన ఎండు గడ్డిలో కొందరు భక్తులకు ముళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బంది పడ్డారు.
● మంచినీరు, అల్పాహారం, పండ్లు, టీలు అందించే స్టాల్స్ వద్ద సిబ్బంది సరిపోకపోవడంతో స్టాల్స్ వద్ద తోపులాటలు జరిగాయి. దాంతో అవి భక్తులకు సక్రమంగా అందలేదు.
● భక్తులు నడిచేటప్పుడు గడ్డిలోంచి దుమ్ము విపరీతంగా పైకి లేవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
● మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ ప్రధాన కూడలిలో గిరి ప్రదక్షిణ వేడుకను ప్రారంభించారు.
● గతంలో వలె ఈ ఏడు గిరి ప్రదక్షిణ వేడుకలో విచిత్ర వేషధారణలను ఏర్పాటు చేయలేదు.
● గిరి ప్రదక్షిణను వేగంగా ముగించారు. సాయంత్రం సుమారు 6.15 గంటకే ఈ వేడుక పూర్తయ్యింది.
సైడ్ లైట్స్
సైడ్ లైట్స్


