ఆట అదరగొట్టారు | - | Sakshi
Sakshi News home page

ఆట అదరగొట్టారు

Dec 29 2025 12:00 PM | Updated on Dec 29 2025 12:00 PM

ఆట అద

ఆట అదరగొట్టారు

స్విమ్మింగ్‌లో పతకాలు

నవంబర్‌ నెలలో నరసరావుపేటలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో జరిగిన పోటీల్లో ధనుష్‌ సాయి 50, 100 మీటర్ల బట్టర్‌ఫ్లై విభాగంలో రెండు గోల్డ్‌ మెడల్స్‌, 100 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. మరో క్రీడాకారిణి పూర్వి 50 మీటర్ల బటర్‌ ఫ్లై, 200 మీటర్ల ఐవీ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌, 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో బ్రాంజ్‌మెడల్‌ సొంతం చేసుకోగా, మోక్ష ప్రియ 50, 100 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగంలో రెండు సిల్వర్‌ మెడల్స్‌, 200 మీటర్ల ఐఎం విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ చేజిక్కించుకున్నారు. డిసెంబర్‌లో ఏలూరులో 7వ పారా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులు అద్భుత ప్రతిభ చాటారు. ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్‌ కోచ్‌ బలగా గణేష్‌ పాక్‌ జలసంఽధి ఈధి అరుదైన ఘనత సాదించాడు. శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్‌ జలసంధిలో ఈత కొట్టారు.

ఏలూరు రూరల్‌: 2025వ సంవత్సరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులకు కొత్త అనుభూతినిచ్చింది. 2025లో సైతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ఉమ్మడి జిల్లా జట్లగానే పోటీపడ్డారు. బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, బాక్సింగ్‌ తదితర క్రీడల్లో జిల్లా బాలబాలికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించారు. క్రీడా వికాస కేంద్రాలు అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. క్రీడా ప్రాంగణాలు, ఆట స్థలాలు, మౌలిక వసతులు అభివృద్ది కాలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్‌ఆర్‌ క్రీడా పురస్కారాలు, ఆడుదాం ఆంధ్ర పోటీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది.

జాతీయ పోటీలకు ఎంపిక

ఏప్రిల్‌ నెల 9వ తేదీ నుంచి 16 వరకూ పాండిచ్చేరిలో జరిగిన 40వ జాతీయస్థాయి అండర్‌–16 యూత్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఏలూరుకు చెందిన ఏ రుత్విక, ఎం.సోమశేఖర్‌, కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థిని నందిని ప్రాతినిథ్యం వహించారు. ఏలూరు సాయ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న పి.దివ్య వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాణించింది. ఏప్రిల్‌లో జూనియర్‌ నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సిల్వర్‌ చేజిక్కించుకుంది.

స్కేటింగ్‌లో పతకాలు

జూన్‌ 13 నుంచి 15 వరకూ కాకినాడలోని జోనల్‌ స్థాయి స్కేటింగ్‌ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న శిఖా సహస్ర అండర్‌–12 విభాగంలో మూడు సిల్వర్‌ మెడల్స్‌, ఒక బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. అండర్‌–10 విభాగంలో శిఖా రమేష్‌బాబు బ్రాంజ్‌ మెడల్‌ చేజిక్కించుకున్నాడు.

అథ్లెటిక్స్‌లో విజయాలు

ఆగస్టులో డిసెంబరు 9 నుంచి 11 వరకూ బాపట్ల జిల్లా చీరాలలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సాకిల్‌బాబు 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రానిస్తున్న సాకిల్‌ బాబు బెస్ట్‌ అథ్లెట్‌గా అవార్డు అందుకున్నాడు. డిసెంబర్‌ 7న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఏలూరు అమలొద్బవి పాఠశాల విద్యార్థి లక్కపాము సుహాన్‌ బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు.

బాక్సింగ్‌లో పతకాలు

డిసెంబర్‌ 21, 22 తేదీల్లో పిఠాపురంలో జరిగిన ఎలైట్‌ సీనియర్‌ ఉమెన్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనన ఆశ్రం వైధ్య కళాశాల విద్యార్థిని భావన లక్ష్మీ సిల్వర్‌ మెడల్‌ సాధించింది. సెయింట్‌ జోసఫ్‌ డెంటల్‌ కళాశాల విద్యార్థిని వాణి 65 కేజీల కేటగిరిలో బ్రాంజ్‌ మెడల్‌ చేజిక్కించుకుంది.

ఆంధ్ర క్రికెట్‌ జట్టులో మునీష్‌వర్మ

జిల్లా క్రికెటర్‌ బి.మునీష్‌వర్మ ఆంధ్ర టీ20 క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్‌లో జరిగిన అంతర జిల్లాల పోటీల్లో పాస్ట్‌ బౌలర్‌, బ్యాట్స్‌మెన్‌గా ప్రతిభ చాటిన మునీష్‌వర్మను సెలక్టర్లు ఆంధ్ర జట్టుకు ఎంపిక చేసారు.

ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

బాస్కెట్‌బాల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ జట్టు

వెయిట్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌ పోటీల్లో పతకాలు

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్‌ బాలికల జట్టు జయకేతనం ఎగరేసింది. విజయవాడలో బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ మొట్టమొదట సారి నిర్వహించిన అండర్‌–23 చాంపియన్‌షిప్‌ టోర్నీ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో తూర్పుగోదావరి జట్టుపై 47–17 స్కోర్‌తో గెలిచి విజేతగా అవతరించింది. నవంబర్‌ 7 నుంచి 10 వరకూ విశాఖపట్నంలో జరిగిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మహిళల, పురుషుల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి మహిళల జట్టు జయకేతనం ఎగరేసింది. విశాఖపట్నంతో హోరాహోరీగా తలపడింది. ఫైనల్‌ పోరులో 54–52 స్కోర్‌తో విజేతగా నిలిచింది.

ఆట అదరగొట్టారు 1
1/6

ఆట అదరగొట్టారు

ఆట అదరగొట్టారు 2
2/6

ఆట అదరగొట్టారు

ఆట అదరగొట్టారు 3
3/6

ఆట అదరగొట్టారు

ఆట అదరగొట్టారు 4
4/6

ఆట అదరగొట్టారు

ఆట అదరగొట్టారు 5
5/6

ఆట అదరగొట్టారు

ఆట అదరగొట్టారు 6
6/6

ఆట అదరగొట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement