మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Dec 29 2025 12:00 PM | Updated on Dec 29 2025 12:00 PM

మంగమ్

మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు ట్రిపుల్‌ ఐటీలో హ్యాకథాన్‌ పోటీలు ప్రారంభం కంపెనీని మోసం చేసిన కేసులో అరెస్టు

బుట్టాయగూడెం : కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం అయినప్పటికీ, మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

ముదినేపల్లి రూరల్‌ : ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్ల శాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గోకులంలోని గోవులకు మహిళలు పసుపు,కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు.

నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఈ నెల 29న ప్రారంభం కానున్న టెక్‌జైట్‌ 25–2.0లో భాగంగా విద్యార్థులకు హ్యాకథాన్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కృత్రిమ మేథస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాల్లో నూతన ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హ్యాకథాన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పీ శ్యామ్‌ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో కృత్రిమ మేథస్సు, మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇలాంటి హ్యాకథాన్‌లు విద్యార్థులలో ఆవిష్కరణ శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: నకిలీ కంపెనీ పెట్టి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరంకి శ్రీరాములను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్టకు చెందిన వీరంకి శ్రీరాములు, వంకాయల సతీష్‌, పట్టణానికి చెందిన మండపాక వినోద్‌కుమార్‌లు జంగారెడ్డిగూడెంకు చెందిన ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత అదే కంపెనీ పేరు వచ్చేలా మరో కంపెనీ పెట్టారు. ఖాతాదారులను, రైతులను మభ్య పెట్టి మోసం చేయడంతో వీరు పనిచేసే కంపెనీ చైర్మన్‌ బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గతంలో సతీష్‌, వినోద్‌కుమార్‌ను అరెస్టు చేయగా.. కోర్టు రిమాండ్‌ విధించింది. ప్రధాన నిందితుడైన శ్రీరాములు పరారీలో ఉన్నాడు. ఆదివారం జీలుగుమిల్లి చెక్‌పోస్టు వద్ద నిందితుడు శ్రీరాములను చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 15 రోజులు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు  
1
1/1

మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement