పురోహిత క్రికెట్ లీగ్ విజేతగా వైజాగ్ టీం
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో గత 8 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. (విశాఖ), (హైదరాబాద్) టీంల మధ్య ఫైనల్స్ జరగగా వైజాగ్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ 101 పరుగులు చేయగా వైజాగ్ 102 పరుగులు చేసి విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు డీఎన్నార్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, డా.గౌతమ్ కుమార్ బహుమతులను అందజేశారు.
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 10.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జీలుగుమిల్లి సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనం సీటు కింద గంజాయి ప్యాకెట్‌లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నిందితులిద్దరూ ఒడిశా బోర్డర్ పరిసర ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి కామారెడ్డి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందని అన్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు. రాజ్‌పుత్ కమల్‌సింగ్, ఆకుల వంశీలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.


