ముగిసిన నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వైఎంహెచ్‌ఏ హాలులో రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు 150 వారి ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్‌వీవీఎస్ పాపారావు నాయుడు నృత్యోత్సవాలను ప్రారంభిస్తూ భవిష్యత్తులో ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని తెలిపారు. గాయత్రి కూచిపూడి నృత్యం, కుమారి తులిక రెడ్డి ఒడిస్సీ నృత్యం, డీ.చక్రవర్తి కూచిపూడి నృత్యం, సంతోష్ పేరిణి శివతాండవం, చక్రవర్తుల పవన్ కుమార్ కూచిపూడి, వరంగల్లుకు చెందిన వైష్ణవి పేరిణి లాస్యం, కాకినాడకు చెందిన బీ. మల్లిఖార్జునరావు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. వీరికి సంస్థ తరపున నృత్య కౌముది అవార్డులు అందించారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు పసుమర్తి శేషుబాబును భరత కళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు స్మారక నృత్య రంగ సేవా తపస్వి అవార్డుతో సత్కరించారు. అనంతరం జాతీయ స్థాయి నృత్య పోటీల్లో విజేతలకు అతిథుల ద్వారా బహుమతులు అందచేశారు.
ముగిసిన నృత్యోత్సవాలు


