
మోకాలి లోతు నీటిలో వెళ్లాలి
మాది రాజమండ్రి ప్రస్తుతం కుక్కునూరు మండలంలో 4వ కేటగిరీ ప్రాంతమైన ఉప్పరమద్దిగట్లలో పని చేస్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి 12 కిలోమీటర్లు వాహనాలు వెళ్లవు. పైగా రోజూ మోకాలి లోతు నీటిలో దిగి వెళ్ళాలి. వాగు పొంగితే ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటాల్సివస్తోంది. ఈ సారి కౌన్సిలింగ్లో మా సొంత మండలానికి బదిలీ చేయాలి.
– కే.శ్రీలత ఎంటీఎస్ టీచర్
200 కిలోమీటర్లు ప్రయాణించాలి
మాది భీమవరం. కుక్కునూరు మండలం పెదరావిగూడెంలో రెండేళ్లుగా పని చేస్తున్నాను. మా ఊరి నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. నాకు ఆరోగ్యం సరిలేదు. అక్కడి వాతావరణం పడడంలేదు. చాలా అనారోగ్యానికి గురయ్యాను. ఈ సారి కౌన్సెలింగ్లో స్పౌజ్ సరౌండింగ్ ఏరియాకు బదిలీ చేయాలి.
– వై.మెర్సీ, ఎంటీఎస్ టీచర్
అత్తమామల బాధ్యత నాపైనే
నేను కుక్కునూరు మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో సింగిల్ టీచర్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను. మా స్వగ్రామం నుంచి అక్కడికి 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అనారోగ్యంతో ఉన్న అత్తమామల బాధ్యత నాపైనే ఉంది. పని భారం ఎక్కువ, జీతం తక్కువ. 4వ కేటగిరీ ఏరియాలో విధులు నిర్వహించడం భారంగా ఉంటోంది.
– ఎం.భాగ్యలక్ష్మి, ఎంటీఎస్ టీచర్
సహకరించని ఆరోగ్యం
మాది తాళ్ళపూడి మండలం. ప్రస్తుతం 140 కిలోమీటర్ల దూరంలోని ఎర్రబోరు పాఠశాలలో పని చేస్తున్నారు. నాకు 58 ఏళ్ల వయసు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాను. వయోభారంతో ఆరోగ్యం సహకరించడం లేదు. నేను పని చేస్తున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా లేదు. కనీస వైద్య సదుపాయం కూడా లేని ప్రాంతం.
– బట్టు సత్తెమ్మ, ఎంటీఎస్ టీచర్
●

మోకాలి లోతు నీటిలో వెళ్లాలి

మోకాలి లోతు నీటిలో వెళ్లాలి

మోకాలి లోతు నీటిలో వెళ్లాలి