కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం
ఉండి: ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారని సీపీఐ నాయకులు తెలిపారు. శనివారం మహదేవపట్నంలో పలువురు మహిళలు సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయానికి వచ్చి ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గొల్లయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాగానే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు రుణం ఇస్తామన్న హామీని కూ టమి నాయకులు అమలు చేయడం లేదన్నారు. దీంతో మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు కూట మి నాయకులపై తిరగబడేందుకు సిద్ధమవుతున్నా రన్నారు. హామీల అమలుకు కూటమి నాయకులు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. హా మీల అమలు కోసం త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తున్నామ న్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తేనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తారన్నారు. సీపీఐ నాయకులు కేతా వెంకటసుబ్బారావు, వీరవల్లి పొట్టి శ్రీను, వీరవల్లి మాణిక్యాలరావు, గుత్తుల సత్తిపండు, గుత్తుల సూర్యనారాయణ పాల్గొన్నారు.


