అధికారుల ఆటవిడుపు
ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు కాసేపు ఆటపాటలతో సేదదీరారు. కార్తీక వన సమారాధనలో భాగంగా జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ ఉద్యోగులు ఒక చోట చేరి సందడి చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొని ఆటలు ఆడారు. కాసేపు సరదా కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఆటవిడుపులో ఉద్యోగులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
– భీమవరం(ప్రకాశం చౌక్)
రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారుల వనసమారాధన కలెక్టరేట్ సమీనంలోని ప్రకృతి ఆశ్రమం మామిడి తోటలో సందడిగా సాగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి రెండు జట్లుగా ఏర్పడి వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడారు. కబడ్డీ ఆడుతూ కలెక్టర్ సిబ్బందిని ఉత్సాహపరిచారు. డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు కార్తీక మాసం విశిష్టత గురించి వివరించారు. ఆకివీడు తహసీల్దార్ ఫోక్ సాంగ్, ఆకివీడు మున్సిపల్ కమిషనర్ పేరడీ సాంగ్, మున్సిపల్ టీచర్ అమ్మ పాట, కలెక్టరేట్ సిబ్బంది పాటలు అకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన సిబ్బందిని కలెక్టర్ అభినందిస్తూ బహుమతులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పనుల ఒత్తిడిలో సతమతమయ్యే అధికారులు, సిబ్బందికి ఆటవిడుపు కార్యక్రమం ఉద్దేశంతో వన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ అడుతున్న కలెక్టర్, జేిసీ
కలెక్టరేట్ ఉద్యోగుల వన సమారాధన
అధికారుల ఆటవిడుపు
అధికారుల ఆటవిడుపు


