గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనుల అడ్డగింత

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనుల అడ్డగింత

పరకాల: ‘మా కుటుంబాలకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోయాక ఏం చేసి బతకాలి. కనీసం ప్రభుత్వ మార్కెట్‌ ధర ప్రకారం న్యాయం చేయకుండా భూములను లాక్కోవాలనుకోవడం ఎంత వరకు న్యాయం’ అని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల మండలం పోచారంలో జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. భారీ బందోబస్తుతో చేరుకున్న గ్రీన్‌ఫీల్డ్‌ అధికారులు సర్వే చేసిన వ్యవసాయ భూముల్లో జేసీబీలతో చదును చేసే ప్రయత్నం చేయగా, సమాచారం అందుకున్న బాధిత రైతులు తమకు సరైన పరిహాం అందించకుండా పంటలను చదును చేయకూడదంటూ పనులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోచారం గ్రామ శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరకాల ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ సతీశ్‌బాబు బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు శాంతించడంతో గ్రీన్‌ఫీల్డ్‌ అధికారులు జేసీబీలతో పంటలను తొలగించి.. రోడ్డు పనులు ప్రారంభించారు. తమకు పరిహారం అందేంత వరకు చేతికొచ్చిన పంటలు నాశనం చేయకూడదని.. కానీ, అధికారులు బలవంతంగా పంటలు ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీగా పోలీసు బలగాల మోహరింపు

సాయంత్రం వరకు కొనసాగిన బాధిత రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement