వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని పోర్చుగల్ దేశస్తులు ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయం చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు అరుణ్ కుమార్, శ్రీనివాస్ ,శ్రీకాంత్, భద్రు దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.


