విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పటిష్టానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పటిష్టానికి చర్యలు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

● టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

గీసుకొండ/నర్సంపేట: విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసి నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్ణాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. గీసుకొండలోని 33/11కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు, మెగా టెక్స్‌టైల్‌ పార్కు, నర్సంపేటలోని 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధిక లోడ్‌ ఉన్న ఫీడర్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్‌్స్‌ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట లోడ్‌ బ్యాలెన్సింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్య పెంపు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో విద్యుత్‌ డిమాండ్‌పై అధికారులతో సమీక్షించారు. ఎస్‌ఈ ఎ.ఆనందం, డీఈలు దానయ్య, తిరుపతి, ఏడీఈ రవి, ఇంజినీరింగ్‌ అధికారులు, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement