వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కిలోల గంజాయిని హనుమకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం (ఇన్సినరేషన్ పద్ధతి) చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ తెలిపారు. ఇందులో అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, సీసీఆర్‌బీ ఏసీపీ పి.డేవిడ్ రాజు, ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


