ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.


