వనదేవతలను దర్శించుకున్న వరంగల్‌ సీపీ | - | Sakshi
Sakshi News home page

వనదేవతలను దర్శించుకున్న వరంగల్‌ సీపీ

Jan 25 2026 8:04 AM | Updated on Jan 25 2026 8:04 AM

వనదేవతలను  దర్శించుకున్న వరంగల్‌ సీపీ

వనదేవతలను దర్శించుకున్న వరంగల్‌ సీపీ

వనదేవతలను దర్శించుకున్న వరంగల్‌ సీపీ కోటలో బోటు షికారుకు ఏర్పాట్లు ఢిల్లీ రిపబ్లిక్‌డే వేడుకలకు శివాని నేడు డయల్‌ యువర్‌ డీఎం

వరంగల్‌ క్రైం: మేడారంలో వనదేవతలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. సీపీ దంపతులకు పూజారులు అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందించారు. ఈసందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, డీఎస్పీ రవీందర్‌తో జాతర బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.

ఖిలా వరంగల్‌: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధానిలో పర్యాటకులు బోటు షికారు చేసేందుకు, కోట అందాలను వీక్షించేందుకు ‘కుడా’ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు కేయించగా.. మంత్రి కొండా సురేఖ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈనేపథ్యంలో శనివారం మొదటి దశ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రాతికోట ఉత్త ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధి చేయనున్నారు. అగర్త చెరువులో జేసీబీతో పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే వర్షాకాలంలోపు సుందరీకరణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు అఽధికారులు పేర్కొన్నారు.

విద్యారణ్యపురి: న్యూడిల్లీలో ఈనెల 26న జరగనున్న రిపబ్లిక్‌డే వేడుకలను వీక్షించేందుకు హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎ.శివాని 100 బెస్ట్‌ మై భారత్‌ వలంటీర్స్‌లో ఎంపికయ్యారని ప్రిన్సి పాల్‌ బి.చంద్రమౌళి శనివారం తెలిపారు. ఈ మేరకు శివానిని కళాశాలలో శనివారం అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.సుహాసిని, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ.కవిత, రామరత్నమాల, వి.మమత అభినందించారు.

హన్మకొండ: ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు, సలహాలు, స్వీకరించేందుకు ఈనెల 25న డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్‌ బి.ధరంసింగ్‌ తెలిపారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్‌, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి, కమలాపూర్‌ మండలాల ప్రయాణికులు 89777 81103కు ఫోన్‌ చేసి సలహాలివ్వాలని ఒక ప్రకటనలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement