
మార్పులకు అనుగుణంగా విద్యాబోధన
● డీఈఓ రంగయ్య నాయుడు
నర్సంపేట రూరల్: విద్యాపరంగా సాంకేతిక రంగా ల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబో ధన జరగాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నా రు. మంగళవారం నర్సంపేట మండలం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల, జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ లర్నింగ్‌పై గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడు తూ విద్యార్థులకు సాంకేతిక విద్యపై బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు సాంకేతికంగా కంప్యూటర్‌పై అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్య నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కొర్ర సారయ్య, సరళ, శిబిరం ఇన్‌చార్జ్‌లు భిక్షపతి, పాపమ్మ, ఎస్‌ఆర్పీలు రాజప్రభు, సురేష్ కుమార్, సుధాకర్, గణేష్ కుమార్, ఉల్లాస్, రాజేంద్రప్రసాద్, డీఆర్పీలు, 13 మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.