వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌

Oct 15 2025 5:40 AM | Updated on Oct 15 2025 5:40 AM

వరంగల

వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌

వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి బుధవారం వరంగల్‌ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్‌ గార్డెన్స్‌లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి డాక్టర్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌ హెలిపాడ్‌కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1 గంటకు హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని పీజీఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్‌ గార్డెన్‌ నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, పీజీఆర్‌ గార్డెన్స్‌ ప్రాంతాల్లో డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీ వెంట జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేశ్‌, ఏసీపీలు పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

మధ్యాహ్నం 1 గంటకు

హనుమకొండకు..

2 గంటలకు తిరుగు పయనం

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని

పరామర్శించనున్న ముఖ్యమంత్రి

వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌1
1/1

వరంగల్‌కు నేడు సీఎం రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement