
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
వీబీ నిర్మలాగీతాంబ
వరంగల్ లీగల్: స్వదేశీ వస్త్రాలు, చేనేత వస్రాలను ప్రోత్సహించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం–వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ మన వాతావరణానికి చేనేత వస్త్రాలు శాసీ్త్రయంగా చల్లదనంతో పాటు సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. సింఽథటిక్‌తో తయారుచేసిన విదేశీ వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొన్నారు. చేనేత ప్రదర్శన, అమ్మకం కౌంటర్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, కార్యదర్శి రమాకాంత్, ఉపాధ్యక్షుడు జయపాల్, కోశాధికారి అరుణ, సీనియర్ న్యాయవాదులు జీవన్‌గౌడ్, ఆనంద్‌మోహన్, కొండబత్తుల రమేశ్‌బాబు, చిర్ర సాంబశివరాజు, రాచకొండ కృష్ణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.