బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Oct 15 2025 5:40 AM | Updated on Oct 15 2025 5:40 AM

బుధవా

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

– IIలోu

న్యూస్‌రీల్‌

ఎంజీఎంలో పెద్దసార్ల విధులు.. ఉండేది హైదరాబాద్‌.. వరంగల్‌కు అప్‌అండ్‌డౌన్‌

బయోమెట్రిక్‌ అటెండెన్స్‌పై చర్యలు శూన్యం ఖాళీగా దర్శనమిస్తున్న ఆర్‌ఎంఓల కుర్చీలు

రూ.లక్షల్లో వేతనాలు.. గంటల్లో సేవలు

బదిలీల తర్వాత పరిపాలనపై పర్యవేక్షణ శూన్యం..

ఆస్పత్రిలోని కీలక మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, సర్జరీ, పిడియాట్రిక్‌, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్‌ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికి వైద్యులు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ నగరానికి అప్‌అండ్‌డౌన్‌ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురు నుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్‌లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం పేద ప్రజలకు శాపంగా మారింది.

ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ నగరానికి అప్‌అండ్‌డౌన్‌ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్‌ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదల ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు.

బయోమెట్రిక్‌ అటెండెన్స్‌పై చర్యలు శూన్యం

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది.

ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి..

వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే..

ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వారు యూనిట్‌ చీఫ్‌గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్‌ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విషయం కలెక్టర్‌తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సైతం స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది.

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20251
1/1

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement