
కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయిక్
పరకాల: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా పదవులు వస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని, పార్టీ నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్‌హాల్‌లో మంగళవారం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నవజ్యోతి పట్నాయక్ నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా కోసం కష్టపడేవారికి ఎలాంటి అన్యాయం జరుగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌జైస్వాల్, పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక పాల్గొన్నారు.