
సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
రాయపర్తి: సాదాబైనామా దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 22ఎ రిజిస్టర్లు, సాదాబైనామా దరఖాస్తులు పరిశీలించారు. రైతులు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్ వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని
కాపాడాలి
నర్సంపేట: నర్సంపేట పట్టణం మహబూబాబాద్ రోడ్డులో కబ్జాకు గురైన సర్వే నంబర్ 121 ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మైసీ శోభన్, రాష్ట్ర నాయకుడు ఆరేపెల్లి బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకుల బృందం మంగళవారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత రెవెన్యూ అధికారులు అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు. లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నివేషణ స్థలాలు లేని నిరుపేదలతో గుడిసెలు వేయించి ధర్నా, రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకులపల్లి ఉప్పలయ్య, చిలపాక బాబు, స్వామి, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సెమినార్‌కు సుమలత
దుగ్గొండి: రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెమినార్‌కు మండలంలోని నాచినపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు వెలిదండి సుమలత ఎంపికయ్యారు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఇంఫాక్ట్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారీర్ చాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించింది. దీంతో బుధవారం జరిగే సెమినార్‌కు సుమలత ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం జూలూరి జ్యోతిలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
వర్ధన్నపేట: మండలంలోని ల్యాబర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుతున్న మంద నందిని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ జలగం రఘువీర్ తెలిపారు. మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–17 వాలీబాల్ విభాగంలో అత్యున్నత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోలీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నందిని పాల్గొననుందని తెలి పారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో నందినిని హెచ్‌ఎం లింగం శైలజ, పీఈటీ రఘువీర్ ఉపాధ్యాయులు, అభినందించారు.
బీసీలను
అణచివేసేందుకు కుట్ర
నర్సంపేట రూరల్: బీసీలను అణచివేసేందుకు అగ్రకులాలు కుట్రలు పన్నుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీని వాస్ అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు యాక య్య ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ చేశారన్నారు. తక్షణమే 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రవి, మరుపాల వీరస్వామి, కడారి సురేష్, సంగెం రమేష్, మేరుగు శంకర్‌లింగం, ముత్యం చేరా లు, సుదర్శన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి

సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి