
సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించాలి
నెక్కొండ: పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ ఇంటికి సౌర విద్యుత్ వ్యవస్థను అందించేందుకు పాటుపడుతున్నాయని తెలంగాణ పునరుత్పాదక శక్తి ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సౌర విద్యుత్ అవగాహన సదస్సులో ఆయ న పాల్గొని మాట్లాడారు. సౌర విద్యుత్ పెంచడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు. జిల్లాలో తెలంగాణ రెడ్ కో పథకం కింద నెక్కొండ ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ సబ్‌ఇంజనీర్ నరేశ్, సోలార్ ఫీల్డ్ అధికారి నవీన్, కార్యదర్శి సదానందం, కుసుమ చెన్నకేశువులు, కదురు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.