
10 రోజులు.. 1,622 వాహనాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు పది రోజుల వ్యవధిలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్), రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం వచ్చింది. ఓవైపు దసరా పండుగ, ఇంకోవైపు వాహనాలపై విధించే జీఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. తొలి వరుసలో బైక్‌లు ఉండగా, ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 1,622 వాహనాల విక్రయాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 75 శాతం బైక్‌లు, కార్లు ఉండగా, మిగిలినవి ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, ఓమ్నీ బస్సులు తదితర వాహనాలు ఉన్నాయి.
విక్రయాలు ౖపైపెకి..
జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 22న 95 వాహన విక్రయాలు జరిగాయి. 23న 115, 24న 158, 25న 189, 26న 173, 27న 154, 28న 112, 29న 193, 30న 240, అక్టోబర్ ఒకటిన 193 వాహనాల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 22న 95 వాహనాలు విక్రయాలైతే, అధికంగా సెప్టెంబర్ 30న 240 వాహనాల అమ్మకాలు జరిగాయి. మిగతా రోజుల్లో సెంచరీపైనే విక్రయాలు జరిగాయని ఆర్టీఏ గణాంకాలు చెబుతున్నాయి.
జీఎస్టీ తగ్గింపుతో భారీగా
వాహన విక్రయాలు
సెప్టెంబర్ 22న 95 విక్రయించగా, అధికంగా 30న 240 వాహనాలు
జిల్లా రవాణాశాఖకు దసరా ధమాకా
టీఆర్, రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం