
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
గీసుకొండ: ఎన్నికల సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. హెల్ప్‌డెస్క్, వీడియోగ్రఫీ, పో లీసు బందోబస్తు, సపోర్టింగ్ స్టాఫ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నోటిఫికేషన్ పత్రాలను పరిశీలించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓ కృష్ణవేణి, మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సురేశ్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్, కార్యాలయ సూపరింటెండెంట్ కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఒక నామినేషన్ దాఖలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల తొలి రోజు గురువారం మనుగొండకు చెందిన తుప్పరి వికాస్ నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు) అభ్యర్థిగా ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు మండల ఎన్నికల అధికారి డి.సురేశ్ తెలిపారు.