
కళాసాంస్కృతిక రంగాల్లో రాణించాలి
● డీఈఓ రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: విద్యార్థులు కళాసాంస్కృతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు సూచించారు. భారత్‌వికాస్ పరిషత్ (బీవీపీ) ఓరుగల్లు శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాతీయ బృందగీతాల పోటీలను వరంగల్ దేశాయిపేట రోడ్డులోని నాగార్జున ప్రైమ్ స్కూల్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాఠశాలలల నుంచి 160 మంది విద్యార్థులు హాజరైన పోటీల్లో డీఈఓ మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు బీవీపీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బీవీపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ రాష్ట్రంలో 23 శాఖలు కలిగి ఉందని తెలిపారు. బీవీపీ రాష్ట్ర బృంద గీతాల పోటీల కన్వీనర్ ఎన్.సదాశివరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గుర్రం దామోదర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.సుధీర్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సత్యనారాయణ, వడుప్పా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యాం మాట్లాడారు. న్యాయనిర్ణేతలుగా నితీశ్‌చంద్ర, కీర్తి సతీష్‌కుమార్, ఎ.మోహన్‌రావు వ్యవహరించారు. సాయంత్రం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బీవీపీ బాధ్యులు వెంకటరెడ్డి, రామారావు, చంచల్‌అగర్వాల్ పాల్గొన్నారు.