
విలవిల
న్యూస్‌రీల్
వరంగల్
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
విష జ్వరాలతో
ఎంజీఎం ఆస్పత్రికి రోగుల తాకిడి..
ఈవీ.. ఈజీ డ్రైవ్!
కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
నెక్కొండ: ఈఫొటోలో కనిపిస్తున్న 9 సంవత్సరాల బాలిక పేరు గాండ్ల సహస్ర. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన మౌనిక– అనిల్‌కుమార్ దంపతుల కుమార్తె అయిన ఈమె స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. 6 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్ర అస్వస్థతకు గురైన సహస్ర చికిత్స పొందుతూ ఈనెల 6న చనిపోయింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా.. జ్వరాలు ఒక్క గుండ్రపల్లిలోనే కాదు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి.
నర్సంపేట రూరల్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాల ఉంది. అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఉన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రతిరోజూ ఓపీ (ఔట్ పేషెంట్) 600 నుంచి 800 వరకు, ఐపీ (ఇన్ పేషెంట్) 30 నుంచి 50 వరకు ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు 50 పడకలు గల పాత ఆస్పత్రి భవనంలోనే సేవలందిస్తున్నారు. కొత్త భవనంలో మరో 50 పడకలతో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో సర్జికల్ యంత్రాలు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మేజర్ ఆపరేషన్ల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్లను నియమించలేదు. ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లి సంవత్సరం కావొస్తున్నా సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. అత్యవసర సమయంలో ఉన్న సిబ్బందికి సెలవులు కూడా దొరకడం లేదు. పేషెంట్ కేర్ అందుబాటులో లేకపోవడంతో రోగులను ఆస్పత్రిలో బంధువులు వీల్‌చైర్లలో తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. నర్సంపేట పట్టణం, మండలంలో సుమారు 80వేల జనాభా వరకు ఉంటుంది. దోమలు వ్యాప్తి చెంది వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 15 డెంగీ కేసులు నమోదుకాగా 14 మంది ఎంజీఎం, నర్సంపేట ఆస్పత్రిలో రికవరీ అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలవని వైద్యులు సూచిస్తున్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి..
దోమల నివారణ కోసం ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వారంలో ఒకరోజు ప్రత్యేకంగా ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని తొలగిస్తే దోమల ఉధృతి తగ్గుతుంది. దోమలతోనే ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. డెంగీ జ్వరం వచ్చిన వారు కోలుకునే సమయంలో బీపీ, రక్తకణాలు తగ్గితే, శ్వాస సంబంధిత సమస్యలకు బారినపడి మృతువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో వారిని ఐసీయూలో చేర్పించి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారు. డెంగీ జ్వరం రాగానే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తూ సమయానికి భోజనం చేసి, మందులు వేసుకోవాలి.
– డాక్టర్ చంద్రశేఖర్, జనరల్ మెడిసిన్, ఫ్రొఫెసర్ నర్సంపేట వైద్య కళాశాల
ఎంజీఎం: జలుబు, గొంతునొప్పి, విషజ్వరాలతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. 8 రోజుల్లో విషజ్వరాలతో బాధపడుతూ 440 మందికి పైగా అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మందికి డెంగీ, 9 మంది మలేరియాతో బాధపడుతున్నారు. చిన్నారులను సైతం విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఈ సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు.
రక్తపరీక్షలకు తప్పని తిప్పలు..
ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల రక్తపరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్నింటిని బయటికి పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి దగ్గరలో ఉన్న ఓ డయాగ్నొస్టిక్ నిర్వాహకులు ఏకంగా కొంతమంది సిబ్బందితో అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సిబ్బంది ఆస్పత్రి లోపలికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తుండడం గమనార్హం.
జిల్లాలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు
నర్సంపేట మండలంలో
15 డెంగీ కేసుల నమోదు
14 మంది రికవరీ..
చికిత్స పొందుతున్న మరొకరు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్న వైద్యులు
నెల ఓపీ ల్యాబ్ ఐపీ
అక్టోబర్ 1 634 101 25
2 – – 16
3 129 32 16
4 692 300 19
5 – 17
6 853 215 20
7 695 215 31
8 718 201 31

విలవిల

విలవిల

విలవిల

విలవిల

విలవిల

విలవిల

విలవిల