
పొగాకు ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన
● డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
దేశాయిపేట: పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానం మానేందుకు ఇష్టపడని వారికి సరైన సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ధూమపానంతో వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించి ధూమపానాన్ని నిరోధించాలని సూచించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి మోహన్‌సింగ్, సైకియాట్రిస్ట్ భరత్, స్థానిక వైద్యాధికారి భరత్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయపాల్‌రెడ్డి, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ డాక్టర్ సతీశ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సోమేశ్వర్, ప్రకాశ్‌రెడ్డి, కోర్నేలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
వ్యాసరచన పోటీలు
కాళోజీ సెంటర్: జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం, సుపరిపాలన అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పోటీలను జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సంపత్‌కుమార్, శరదృతి, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పొగాకు ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన